Telangana liquor sales: తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డు.. రెండ్రోజుల్లో రూ. 419 కోట్ల అమ్మకాలు

Telangana liquor sales surge Rs 419 crore in two days
  • దసరా పండుగ వేళ రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
  • సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ. 333 కోట్ల మద్యం కొనుగోళ్లు
  • గాంధీ జయంతి డ్రై డే కారణంగా ముందురోజే పోటెత్తిన జనం
  • వివరాలు వెల్లడించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ
దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. పండుగకు ముందు కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 419 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అని వారు తెలిపారు.

ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30న అత్యధికంగా రూ. 333 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన మరో రూ. 86 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచే రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు రెట్టింపైనట్లు అధికారులు పేర్కొన్నారు.

నిన్న‌ గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించింది. అదే రోజు దసరా పండుగ కూడా ఉండటంతో, మందుబాబులు ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు. ఈ కారణంగా అక్టోబర్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, లిక్కర్ మార్ట్‌ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. పలుచోట్ల మద్యం కోసం జనం బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. పండుగ సీజన్‌తో పాటు డ్రై డే కూడా కలిసి రావడమే ఈ భారీ అమ్మకాలకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
Telangana liquor sales
Telangana Excise Department
Dasara festival
Gandhi Jayanti
liquor sales record
wine shops
liquor marts
Telangana revenue
dry day effect

More Telugu News