Hyderabad Metro: రూ. 3.5 లక్షలతో మెట్రో స్టేషన్‌కు ప్రయాణికుడు.. అనుమతించని సిబ్బంది

Hyderabad Metro Denies Entry to Passenger with 35 Lakh Rupees
      
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారికి ఓ ముఖ్య గమనిక. రైల్లో ప్రయాణించేటప్పుడు మీ వెంట భారీగా నగదు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే, ఓ నిబంధన గురించి తప్పక తెలుసుకోవాలి. తాజాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. బుధవారం ఓ ప్రయాణికుడికి అక్కడ ఊహించని అనుభవం ఎదురైంది.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భద్రతా సిబ్బంది రూ.3.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆపి, నిబంధనల గురించి వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం మెట్రో రైళ్లలో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.

అంతకుమించి నగదుతో ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. సిబ్బంది చెప్పిన నిబంధనతో ఆ ప్రయాణికుడు ప్రయాణం చేయలేకపోయారు. చేసేది లేక, ఆ నగదుతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు మెట్రో అధికారులు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిబంధన అమలులో ఉందని వారు తెలిపారు.
Hyderabad Metro
Metro Rail
RBI Guidelines
Cash Limit
Jubilee Hills Checkpost
Hyderabad
Metro Station
Currency Restrictions

More Telugu News