YS Jagan: కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి: వైఎస్ జగన్

YS Jagan Wishes Everyone Blessings of Kanaka Durga
  • తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
  • దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అన్న వైఎస్ జగన్
  • చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న వైఎస్ జగన్
దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచికే లభిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని జగన్‌ అన్నారు.

ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని జగన్‌ ఆకాంక్షించారు. 
YS Jagan
Kanaka Durga
Vijayadashami
Durgashtami
Mahanavami
Telugu states
Dasara festival
AP Politics
YSRCP

More Telugu News