Vladimir Putin: డిసెంబర్‌లో భారత్ పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Vladimir Putin to Visit India in December
  • శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రానున్న పుతిన్
  • అమెరికా అధిక సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో పుతిన్ రాకకు ప్రాధాన్యత
  • గత ఏడాది రెండుసార్లు సమావేశమైన మోదీ, పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ డిసెంబర్ నెలలో భారత్‌ పర్యటనకు రానున్నారు. ప్రతి సంవత్సరం జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్‌కు విచ్చేయనున్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై అమెరికా అధిక సుంకాలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌లో పుతిన్ పర్యటన ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఆగస్టులో మాస్కో పర్యటన సందర్భంగా ప్రకటించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పర్యటన ఉంటుందని గత వారం ధ్రువీకరించినప్పటికీ, తేదీలను వెల్లడించలేదు. డిసెంబర్ 5, 6 తేదీల్లో పర్యటన ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పుతిన్‌లు గత ఏడాది రెండుసార్లు సమావేశమయ్యారు. జులైలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ రష్యాకు వెళ్లారు. అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్‌లో మరోసారి వీరిద్దరు సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ పుతిన్-మోదీ భేటీ అయ్యారు.
Vladimir Putin
Russia India relations
India Russia summit
Narendra Modi
Ajit Doval

More Telugu News