హైదరాబాద్ పాతబస్తీలో రాక్ పైథాన్ కలకలం.. ఇదిగో వీడియో
- హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ కాలేజీ ప్రాంతంలో కనిపించిన రాక్ పైథాన్
- కొండ చిలువను బంధించిన వన్యప్రాణుల సంరక్షకుడు రిజ్వీ
- త్వరలో అటవీశాఖ అధికారులకు అప్పగించనున్న రిజ్వీ
స్థానికులు వెంటనే వన్యప్రాణి సంరక్షకుడు సయ్యద్ తాకీ అలీ రిజ్వీకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రిజ్వీ చాకచక్యంగా కొండచిలువను బంధించారు. ఆయన ఆ కొండచిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. అటవీ శాఖ అధికారులు దానిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టనున్నారు.