RBI Governor: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్

RBI Governor Clarifies on UPI Transaction Charges
  • యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదన్న ఆర్బీఐ గవర్నర్
  • ఫీజు వసూలు చేసే అంశాన్ని తాము పరిశీలించడం లేదని స్పష్టీకరణ
  • ప్రస్తుత విధానంలో యూపీఐ పూర్తిగా ఉచితంగా ఉంటుందని హామీ
యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం స్పష్టం చేశారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, యూపీఐ వేదికల ద్వారా జరిగే లావాదేవీలకు రుసుము వసూలు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని, వినియోగదారులకు ఇది ఉచితంగానే కొనసాగుతుందని తెలిపారు.

డిజిటల్ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధిస్తారనే సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ప్రస్తుత విధానంలో యూపీఐ పూర్తిగా ఉచితంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా యూపీఐని 'జీరో కాస్ట్' ప్లాట్‌ఫామ్‌గా కొనసాగించాలనే వైఖరిని గవర్నర్ వ్యాఖ్యలు బలపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ చెల్లింపుల మార్కెట్‌గా భారత్ స్థానం మరింత సుస్థిరమవుతోందని ఆయన పేర్కొన్నారు.
RBI Governor
RBI
UPI charges
UPI transactions
Sanjay Malhotra
Reserve Bank of India
digital payments

More Telugu News