కాకినాడలో ప్రేమించిన బాలికను బ్లేడ్ తో గొంతుకోసి చంపేసిన యువకుడు

Andhra Pradesh youth kills girlfriend at temple then commits suicide
  • ఆపై రైలుకిందపడి ఆత్మహత్య
  • కాకినాడ జిల్లా పనసపాడులో ఘోరం
  • మంగళవారం అర్ధరాత్రి గ్రామంలోని ఆలయం వద్ద ఘటన
ప్రేమించిన బాలికను దారుణంగా హతమార్చిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం అర్ధరాత్రి అశోక్ ఆ బాలికను పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Ashok
Kakinada district
Andhra Pradesh
murder
suicide
love affair
crime news
Samarlakota
Girl Murder
boyfriend

More Telugu News