Ananya Joshi: ఉద్యోగం పోవడంతో కన్నీటితో వీడ్కోలు.. అమెరికా ఐ లవ్ యూ అంటూ భారతీయ యువతి వీడియో!

Indian Student Ananya Joshis Emotional Goodbye to America After Layoff
  • 2024లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనన్య జోషి
  • స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం.. ఇటీవల జాబ్ కోల్పోయిన అనన్య
  • నెల రోజుల క్రితం అర్జెంటుగా ఉద్యోగం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఓ యువతి అక్కడి జీవనవిధానం నచ్చి ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండిపోవాలని అనుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరికింది కానీ ఇటీవల కంపెనీ ఆమెను తొలగించింది. దీంతో మరొక ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీసా గడువులోగా ఉద్యోగం దొరకకపోవడంతో కన్నీటితో అమెరికాకు వీడ్కోలు చెప్పింది. కొంతకాలమే ఉన్నా అమెరికా తన జీవితంలో మధురానుభూతిగా నిలుస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

భారత్ కు చెందిన అనన్య జోషి 2024 లో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ అందుకుంది. తర్వాత ఓ స్టార్టప్ కంపెనీలో చేరింది. అమెరికా జీవన విధానానికి ముగ్దురాలైన అనన్య.. ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండిపోవాలని భావించింది. అయితే, ఇటీవల ఆమెను కంపెనీ ఉద్యోగంలో నుంచి తొలగించింది. స్టూడెంట్ వీసాతో అమెరికా వెళ్లిన అనన్యకు స్టార్టప్ కంపెనీ ఎఫ్ 1 వీసా ఇచ్చి ఉద్యోగం కల్పించింది.

ఆ ఉద్యోగం కోల్పోవడంతో ఎఫ్ 1 వీసా నిబంధనల ప్రకారం నెల రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించి వీసాను పునరుద్ధరించుకోవలసి ఉంది. ఆ గడువులోపు మరో ఉద్యోగం లభించకపోవడంతో అనన్య తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాను విడిచి వెళ్లవలసి వచ్చింది. ఈ సందర్భంగా అమెరికాపై తాను పెంచుకున్న మమకారాన్ని వ్యక్తం చేస్తూ, వీడ్కోలు పలుకుతూ తీసిన ఒక వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ananya Joshi
USA
America
Indian student
F1 visa
Job loss
Northwestern University
Biotechnology
Immigration
Student visa

More Telugu News