Chandrababu Naidu: అమిత్ షాలతో చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై చర్చ!

Chandrababu Naidu Meets Amit Shah Discusses Key Issues
  • అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన సీఎం చంద్రబాబు
  • రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక సహాయం అంశాలపై సమగ్రంగా చర్చ
  • రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరిన సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక సహాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.

సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలను అమిత్ షాకు వివరించారు. అంతేగాక, వైకాపా పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కేంద్రం అండతో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రమోహన్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. 
Chandrababu Naidu
Amit Shah
Andhra Pradesh
AP CM
Amaravati
Polavaram Project
AP Finance
Narendra Modi
TDP
Central Government

More Telugu News