JC Diwakar Reddy: నెలకు 2 లక్షలిచ్చినా పనిచేసే వారు దొరకరు: జేసీ దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy Comments on Housewife Role and Future Job Market
  • గృహిణి అంటే అడ్మినిస్ట్రేటర్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు
  • తాడిపత్రి అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపు
  • అండర్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి
నిత్యం తన రాజకీయ విమర్శలతో వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి అందుకు భిన్నంగా మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గృహిణి (హౌస్‌వైఫ్) పాత్రను తక్కువగా అంచనా వేయొద్దని, ఆమె ఒక అడ్మినిస్ట్రేటర్‌తో సమానమని ఆయన అభివర్ణించారు. సమాజానికి మేలు చేయాలనే తపన ఉన్న మహిళలు సామాజిక సేవ కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తాడిపత్రిలో నెలకొన్న పలు సమస్యలపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ముఖ్యంగా అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో పట్టణం వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలలో వ్యర్థ పదార్థాలను వేయడం వల్లే ఈ సమస్య తీవ్రమవుతోందని, దీని పరిష్కారానికి మహిళల సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లలు, మహిళలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

"తాడిపత్రి బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. త్వరలోనే దీనిపై ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా" అని జేసీ తెలిపారు. చేతికి చీపురు (పరక) పట్టాలంటే ధైర్యం ఉండాలని, మంచి పనులు చేయడం ద్వారా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన మహిళలకు హితవు పలికారు.

ఈ సందర్భంగా భవిష్యత్తు పరిస్థితులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "త్వరలో నెలకు రెండు లక్షల రూపాయలు జీతం ఇచ్చినా పనిచేసే వారు దొరకరు. అలాంటి రోజులు రాబోతున్నాయి" అంటూ ఆయన జోస్యం చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పరోక్షంగా సూచించారు. 
JC Diwakar Reddy
JC Prabhakar Reddy
Tadipatri
Andhra Pradesh politics
housewife
women empowerment
social service
under drainage system
municipal chairman
future jobs

More Telugu News