Shraddha Srinath: ఓటీటీకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్!

Shraddha Srinath Special
  • శ్రద్ధా శ్రీనాథ్ నుంచి 'ది గేమ్'
  • తమిళంలో రూపొందిన సిరీస్
  • తెలుగులోను అందుబాటులోకి  
  • అక్టోబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

శ్రద్ధా శ్రీనాథ్ .. ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. తను ప్రధాన పాత్ర పోషించిన ఒక తమిళ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'ది గేమ్'. యు నెవర్ ప్లే ఎలోన్ అనేది ఉపశీర్షిక. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ను 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన జోనర్లో ఈ సిరీస్ ను రూపొందించారు. సమీర్ నాయర్ - ప్రమోద్ నిర్మించిన ఈ సిరీస్ కి, రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించాడు. సంతోష్ ప్రతాప్ .. చాందిని ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సైమన్ కింగ్ సంగీతాన్ని అందించిన ఈ సిరీస్ నుంచి రీసెంటుగా వదిలిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. 

కావ్య రాజారామ్ (శ్రద్ధా శ్రీనాథ్) ఒక సంస్థలో గేమ్ డెవలపర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే ఆఫీసులో పనిచేస్తున్న అనూప్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సొసైటీ పట్ల ఆమెకంటూ కొన్ని అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాంటి ఆమెపై అటు సోషల్ మీడియాలో .. ఇటు బయట కొంతమంది టార్గెట్ చేస్తారు. కొంతమంది ముసుగు వ్యక్తులు ఆమెను ఫాలో అవుతూ ఉంటారు.  ముసుగుల వెనకున్నది ఎవరు? వాళ్లు ఆశిస్తున్నది ఏమిటి? అనేది కథ.

Shraddha Srinath
The Game web series
Tamil web series
Netflix
suspense thriller
OTT release
Santhosh Prathap
Chandini
Telugu dubbed
crime thriller

More Telugu News