Revanth Reddy: అలా చేస్తే మీ వేతనంలో కట్ చేసి తల్లిదండ్రులకు ఇస్తాం: గ్రూప్-1 విజేతలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక

Revanth Reddy Warns Salary Cut for Neglecting Parents
  • శిల్పకలా వేదికగా గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాల అందజేత
  • మూడు లక్షల మంది పోటీ పడితే 562 మంది ఎంపికయ్యారన్న ముఖ్యమంత్రి
  • తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని గ్రూప్-1 విజేతలకు సూచన
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనంలో 10 శాతం వారికి చెల్లించేలా చట్టం తీసుకువస్తామని గ్రూప్-1కు ఎంపికైన ఉద్యోగులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రూప్-1 విజేతలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రూప్-1 పరీక్షలకు మూడు లక్షల మందికి పైగా పోటీ పడిగా 562 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన ఉద్యోగులెవరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకోని పక్షంలో వారి వేతనంలో 10 శాతం తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, తాను డబ్బులు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పదేళ్లు తెలంగాణ ప్రజలు అవకాశమిస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వాసఘాతకులుగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు.
Revanth Reddy
Telangana
Group 1
Government Employees
Salary Cut
Parents
BRS

More Telugu News