Konda Surekha: సచివాలయంలో ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కొండా సురేఖ, సీతక్క

Konda Surekha and Seethakka Celebrate Bathukamma with Employees
  • 'ఒక్కేసి పువ్వేసి చందమామ' అంటూ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆడిన మంత్రులు
  • బతుకమ్మలను పేర్చి ఇళ్ల నుంచి  తీసుకువచ్చిన ఉద్యోగినులు
  • గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క సచివాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. 'ఒక్కేసి పువ్వేసి చందమామ' అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు మహిళా ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి బతుకమ్మలను అందంగా పేర్చి సచివాలయానికి తీసుకువచ్చారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క పక్కపక్కనే నిలబడి బతుకమ్మ ఆడి సందడి చేశారు.

బతుకమ్మ పాట ఆవిష్కరణ

ప్రముఖ గాయకుడు గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రజాపాలనపై సంతోష్ రూపొందించిన ఈ బతుకమ్మ పాటను మంత్రులు ప్రశంసించారు. "కాంగ్రెస్ పాలన కష్టాలను బాపింది ఉయ్యాలో" అంటూ రూపొందించిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Konda Surekha
Seethakka
Telangana
Bathukamma
Secretariat
Bathukamma songs
Gaddam Santhosh

More Telugu News