Shubman Gill: విండీస్ తో తలపడే భారత జట్టు ఇదే!

India Test Squad Announced for West Indies Series Led by Shubman Gill
  • గిల్, గంభీర్‌ లతో దుబాయ్ లో అగార్కర్ భేటీ
  • అనంతరం టెస్టు జట్టును ప్రకటించిన అగార్కర్
  • కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ గా జడేజా
  • పంత్‌ స్థానంలో ఎన్‌.జగదీశన్‌ కు ఛాన్స్
వెస్టిండీస్‌ తో అక్టోబర్ 2 నుంచి జరగనున్న టెస్ట్ సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. ఆసియా కప్ టోర్నీ కోసం దుబాయ్ లో ఉన్న భారత టెస్టు జట్టుసారథి శుభ్‌మన్‌ గిల్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో అగార్కర్ తాజాగా భేటీ అయ్యారు. టెస్టు జట్టు కూర్పుపై వారితో చర్చించాక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల ఈ సిరీస్ లో టీమిండియా శుభ్ మన్ గిల్ సారథ్యంలో విండీస్ తో తలపడనుంది.

వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను, రిషబ్ పంత్ స్థానంలో ఎన్‌.జగదీశన్‌ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో పెద్దగా రాణించని కరుణ్ నాయర్‌, శార్దూల్ ఠాకూర్‌ లను పక్కన పెట్టారు. కాగా, జస్‌ప్రీత్ బుమ్రా రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడని అగార్కర్ పేర్కొన్నారు. షమీ ఫిట్‌నెస్‌పై ఇంకా అప్‌డేట్ రాలేదన్నారు. కరుణ్‌ నాయర్‌ తమ అంచనాలను అందుకోలేకపోయాడని అగార్కర్ చెప్పారు.

టీమిండియా జట్టు..
శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (బ్యాకప్ వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్.
Shubman Gill
India vs West Indies
India Test Squad
Ajit Agarkar
Ravindra Jadeja
N Jagadeesan
BCCI
Indian Cricket Team
West Indies Test Series
Jasprit Bumrah

More Telugu News