Smita Sabharwal: స్మితా సబర్వాల్ పై చర్యలు వద్దు.. హైకోర్టు

High Court Relief for Smita Sabharwal in Kaleshwaram Case
  • జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తన పేరు చేర్చడంపై స్మిత అభ్యంతరం
  • కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్
  • ఈ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దన్న కోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు హైకోర్టు ఊరటనిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఈ నివేదికలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరును కూడా కమిషన్ పేర్కొంది. దీనిపై స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు.

నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ఆమె న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి దీనిని విచారిస్తామని పేర్కొంది.
Smita Sabharwal
Kaleshwaram Project
Telangana High Court
Justice PC Ghosh Commission
IAS officer
Corruption allegations
Telangana news
Court order
Interim orders
Petition

More Telugu News