Adinarayana Reddy: చంద్రబాబుకు నోటీసులు పంపిన సీఐ శంకరయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Adinarayana Reddy Demands Action Against CI Sankaraiah in Vivekananda Case
  • సీఐ వెనుక వివేకా హత్య కేసు నిందితులున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపణ
  • హంతకులతో శంకరయ్య కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు
  • హత్య జరిగిన రోజు సీఐ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య వెనుక ఆ కేసులోని నిందితులే ఉన్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపడం వెనుక కూడా వారి ప్రోద్బలమే ఉందని ఆయన స్పష్టం చేశారు. హంతకులతో శంకరయ్య కుమ్మక్కయ్యారని, ఆయన పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

"వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో రక్తపు మరకలను తుడిచివేస్తుంటే, అప్పటి సీఐగా ఉన్న శంకరయ్య ఏం చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా శంకరయ్యతో నోటీసులు ఇప్పించింది కూడా ఆ నిందితులేనని ఆయన ఆరోపించారు. హంతకులకు సహకరించిన శంకరయ్యపై డీజీపీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఐ శంకరయ్యను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని అన్నారు. వివేకా హత్య కేసు విచారణలో తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ సీఐ శంకరయ్య ఇటీవల లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపైనే ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 
Adinarayana Reddy
YS Vivekananda Reddy murder case
CI Sankaraiah
Chandrababu Naidu
Pulivendula
Andhra Pradesh politics
BJP MLA
Legal notice
Investigation

More Telugu News