Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్
- మరోసారి వార్తల్లో నిలిచిన బండ్ల గణేశ్
- కొంతమంది వారి కోసం ఎంత చేస్తున్నారో చూడరని వ్యాఖ్య
- ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనే దానిపై లేని స్పష్టత
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు... నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు" అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై ఆయన స్పష్టతను ఇవ్వలేదు.
కారణాలు ఏమైనప్పటికీ, ప్రస్తుతం బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్ టాలీవుడ్ వర్గాలతో పాటు, పవన్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కారణాలు ఏమైనప్పటికీ, ప్రస్తుతం బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్ టాలీవుడ్ వర్గాలతో పాటు, పవన్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.