Shah Rukh Khan: ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకుంది వీరే!

National Film Awards 2024 Winners Shah Rukh Khan and Rani Mukerji
  • ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం
  • ఉత్తమ చిత్రంగా విధు వినోద్ చోప్రా '12th ఫెయిల్'
  • ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే
  • 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' చిత్రానికి రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు
  • తెలుగులో బేబి, బలగం, హనుమాన్ చిత్రాలకు పురస్కారాలు
  • 'బేబి' చిత్రంలోని పాటకు ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్
భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది జాతీయ వేదికపై తెలుగు సినిమా తన సత్తాను చాటింది. 'బేబి', 'బలగం', 'హనుమాన్' వంటి చిత్రాలు పలు కీలక విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుని తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి.

విధు వినోద్ చోప్రా నిర్మించి, దర్శకత్వం వహించిన '12th ఫెయిల్' ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచినందుకు విక్రాంత్ మాస్సే, 'జవాన్' చిత్రానికి గాను షారుఖ్ ఖాన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకున్నారు. 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు.

తెలుగు సినిమాకు దక్కిన గౌరవం

ఈసారి తెలుగు సినిమా పలు విభాగాల్లో తనదైన ముద్ర వేసింది. 'బేబి' చిత్రంలోని 'ప్రేమిస్తున్నా' పాటకు గాను పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎంపికయ్యారు. ఇదే చిత్రానికి సాయి రాజేష్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రచయితగా అవార్డు గెలుచుకున్నారు. 'బలగం' సినిమాలోని 'ఊరు పల్లెటూరు' పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇక 'హనుమాన్' చిత్రానికి గాను జెట్టి వెంకట్ కుమార్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పురస్కారం అందుకున్నారు. 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యారు.

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల పూర్తి జాబితా

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్ (విధు వినోద్ చోప్రా)
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ వినోదాన్ని అందించిన ప్రజాదరణ పొందిన చిత్రం: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (కరణ్ జోహార్)
ఉత్తమ దర్శకత్వం: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)
ఉత్తమ సహాయ నటుడు: విజయరాఘవన్ (పూక్కాలం), ఎం. ఎస్. భాస్కర్ (పార్కింగ్)
ఉత్తమ సహాయ నటి: ఊర్వశి (ఉల్లొళుక్కు), జానకి బోడివాలా (వశ్)
ఉత్తమ నూతన దర్శకుడు: ఆశిష్ అవినాష్ బెండే (ఆత్మపాంప్లెట్)
ఉత్తమ బాలల చిత్రం: నాల్ 2
ఉత్తమ బాలనటులు: సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు), కబీర్ ఖందారే (జిప్సీ), త్రీషా థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగతాప్ (నాల్ 2)
జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలతో కూడిన ఉత్తమ చిత్రం: సామ్ బహదూర్
ఉత్తమ నేపథ్య గాయకుడు: పీవీఎన్ఎస్ రోహిత్ (బేబి - ప్రేమిస్తున్నా)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (జవాన్ - చలేయా)
ఉత్తమ గీత రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం - ఊరు పల్లెటూరు)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (AVGC): జెట్టి వెంకట్ కుమార్ (హను-మాన్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): సాయి రాజేష్ (బేబి), రామ్‌కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్)
ఉత్తమ సంభాషణలు: దీపక్ కింగ్రానీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ప్రసంతను మహాపాత్ర (ది కేరళ స్టోరీ)
ఉత్తమ సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్ (యానిమల్)
ఉత్తమ ఎడిటింగ్: మిథున్ మురళి (పూక్కాలం)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మోహన్‌దాస్ (2018)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: సచిన్ లోవలేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
ఉత్తమ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ - ధిండోరా బాజే రే)
ఉత్తమ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ (రిషిరాజ్ అగర్వాల్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: గిధ్ (ది స్కావెంజర్) (మనీష్ సైనీ)
ఉత్తమ సినీ విమర్శకుడు: ఉత్పల్ దత్తా
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: మోహన్ లాల్ 
Shah Rukh Khan
National Film Awards
71st National Film Awards
Indian Cinema
Telugu Cinema
Balagam
Hanuman
12th Fail
Draupadi Murmu
Award Winners

More Telugu News