Sukriti Veni: రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న తెలుగు చిత్రం

Telugu film receives Presidential praise
  • 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో నటించిన సుకృతి వేణి 
  •  ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సాధించిన సుకృతి 
  •  రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న పురస్కారం 
  •  
'ఓ చెట్టును కాపాడాటానికి ఓ అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తే సమాజానికి మంచి సందేశంతో పాటు, యువతలో మంచి చైతన్యం వస్తుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సుకృతి వేణి మంచి నటన కనబరిచింది' అన్నారు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం మంగళవారం ఢీల్లీలోని విజ్క్షాన్‌భవన్‌లో జరిగింది. 

ఈ వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు విజేతలు పురస్కారాలతో పాటు జ్క్షాపికలు, ప్రశాంస పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో 'గాంధీ తాత చెట్టు' సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు సుకృతి నటనకు అభినందనలు తెలియజేయడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ బాలనటి జాతీయ అవార్డు దక్కింది. 

ఈ రోజు జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా సుకృతి అవార్డు అందుకున్నారు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో తబితా సుకుమార్‌ సమర్పణలో నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, శేష సింధులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే పలు ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్స్‌ల్లో కూడా పలు అవార్డులు సాధించింది. 


Sukriti Veni
Gandhi Thatha Chettu
National Film Awards
Droupadi Murmu
Telugu Movie
Best Child Artist
Padmavathi Malladi
Sukumar
Telugu Cinema
Indian Cinema

More Telugu News