Smita Sabharwal: ఆ నివేదిక ఆధారంగా నాపై చర్యలు తీసుకోవద్దు!: హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

Smita Sabharwal Approaches High Court Against Action Based on Report
  • కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టులో సవాల్ చేసిన స్మితా
  • ఆ నివేదికను కొట్టివేయాలని పిటిషన్
  • రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్న స్మితా సబర్వాల్ పిటిషన్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. నోటీసుల జారీ మరియు వాంగ్మూలం నమోదు ప్రక్రియలను ఆమె సవాల్ చేస్తూ, ఆ నివేదికను రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు.

ఆ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె అభ్యర్థించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. పరిశీలన పూర్తయి లిస్ట్ అయ్యాక విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇదివరకే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఇటీవల ఊరట లభించింది. కమిషన్ నివేదిక సిఫార్సుల ఆధారంగా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.
Smita Sabharwal
Kaleshwaram project
PC Ghosh Commission
Telangana High Court
SK Joshi

More Telugu News