Indian seaman: కార్గో నౌక నుంచి సముద్రంలో పడిపోయిన భారతీయుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Indian Man Fell from Cargo Ship Near Maldives Search Ongoing
  • మాల్దీవుల సమీపంలో ప్రమాదం
  • భారతీయ జెండాతో ఉన్న నౌకలో ప్రమాదం
  • వ్యక్తి కోసం గాలిస్తున్న మాల్దీవుల జాతీయ రక్షణ దళం
సముద్రంలో ప్రయాణిస్తుండగా ఓడ నుంచి పడిపోయిన ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. ఈ దుర్ఘటన మాల్దీవుల సమీపంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. భారతీయ జెండా కలిగిన ఎంఎస్‌వీ దౌలా అనే నౌక సోమవారం మాల్దీవుల ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

నౌకలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయాడు. వెంటనే మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి సమాచారం అందించడంతో వారు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు ఎనిమిది గంటల నుంచి గాలిస్తున్నప్పటికీ, అతడి ఆచూకీ లభించలేదని అధికారులు వెల్లడించారు. సముద్రంలో పడిపోయిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Indian seaman
Maldives
Cargo ship accident
MSV Daula
Indian Navy

More Telugu News