Kantara Chapter 1: ఒళ్లు గగుర్పొడిచేలా 'కాంతార' ప్రీక్వెల్.. అంచనాలు పెంచిన 'కాంతార చాప్ట‌ర్‌-1' ట్రైల‌ర్

Rishab Shetty Kantara Chapter 1 Trailer Released
  • కాంతారకు ప్రీక్వెల్‌గా రాబోతున్న 'చాప్టర్ 1'
  • ట్రైలర్‌ను విడుదల చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
  • ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న 'పంజుర్లి' సన్నివేశాలు
  • రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో చిత్రం
  • అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమా పరంపరలో తదుపరి రాబోతున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ ఉత్కంఠను మరింత పెంచుతూ, 'కాంతార చాప్టర్ 1' పేరుతో తెరకెక్కుతున్న ప్రీక్వెల్ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో 'పంజుర్లి'కి సంబంధించిన సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ స‌న్నివేశాలు ప్రేక్షకులకు థియేట‌ర్ల‌లో ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతున్నాయన‌డంలో సందేహం లేదు. రుక్మిణి వ‌సంత్ మ‌హారాణి పాత్ర‌లో చాలా అందంగా క‌నిపించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభ మరోసారి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా మరో స్థాయిలో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

2022లో వచ్చిన 'కాంతార' కథకు ముందు ఏం జరిగిందనే అంశంతో ఈ ప్రీక్వెల్‌ను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలతో సిద్ధమవుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'కాంతార' సాధించిన అపూర్వ విజయం నేపథ్యంలో, ఇప్పుడు 'చాప్టర్ 1'పై కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 

Kantara Chapter 1
Rishab Shetty
Kantara prequel
Panjurli
Rukmini Vasanth
Kannada movies
Prabhas
action thriller
Indian cinema
period drama

More Telugu News