విశాఖకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
- రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- విశాఖ నుంచి అమరావతికి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం
- శాసనసభలో వ్యవసాయ రంగంపై నిర్వహించే లఘు చర్చలో ప్రసంగించనున్న సీఎం
నోవాటెల్ హోటల్‌లో ఈ-గవర్నెన్స్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత విశాఖ నుంచి మధ్యాహ్నానికి అమరావతికి తిరిగి చేరుకుంటారు. అనంతరం శాసనసభలో వ్యవసాయ రంగంపై నిర్వహించే లఘు చర్చలో పాల్గొని ప్రసంగిస్తారు.