KA Paul: కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు

Sexual Harassment Case Filed Against KA Paul
––
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు పాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేఏ పాల్‌ కంపెనీలో నైట్‌ షిఫ్టులో పనిచేస్తున్న యువతి ఆయనపై ఫిర్యాదు చేసింది.

విధి నిర్వహణలో ఉన్న తనను కేఏ పాల్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పేర్కొంది. దీనికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లను పోలీసులకు అందజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
KA Paul
KA Paul sexual harassment case
Praja Shanti Party
Hyderabad police
Panjagutta police station
sexual harassment complaint
FIR
WhatsApp messages

More Telugu News