Jagan: జగన్ కు యనమల హితవు.. ఆర్టికల్ 188 చదువుకోవాలని సూచన
––
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్న హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వరుసగా 60 రోజులు సభకు రాని ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయొచ్చని చెప్పారు. అంతేకాక, తదుపరి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో కోర్టు నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని యనమల వివరించారు.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామనడం కూడా అనర్హత పరిధిలోకే వస్తుందని చెప్పారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) లో స్పష్టంగా ఉందని వివరించారు. ఈ విషయంపై క్లారిటీ కోసం రాజ్యాంగం చదువుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు యనమల సూచించారు. అప్పటికీ అర్థం కాకుంటే న్యాయవాదులను అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.