Narendra Modi: 5 గంటలకు జాతిని ఉద్దేశించి మోదీ స్పీచ్: పీఎంవో

Narendra Modi to Address Nation at 5 PM Today PMO
  • ప్రసంగం దేని గురించనే విషయంపై సస్పెన్స్
  • జీఎస్టీ సంస్కరణల అమలు వేళ పీఎంవో ప్రకటన
  • ఇప్పటి వరకు ఐదుసార్లు ఇలా ప్రసంగించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని స్పీచ్ ఉంటుందని పేర్కొంది. అయితే, ప్రధాని ఏ విషయంపై మాట్లాడతారనే దానిపై పీఎంవో స్పష్టత ఇవ్వలేదు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సస్పెన్స్ నెలకొంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే కొనసాగుతాయి.

గతంలో ఎప్పుడెప్పుడంటే..
2016 నవంబర్ 8న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.
2019 మార్చి 12న ప్రసంగించిన ప్రధాని.. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వివరాలను వెల్లడించారు.
2020 మార్చి 24న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు.
2020 ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ వెల్లడించారు.
2025 మే 12న పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించారు.
Narendra Modi
PM Modi speech
address to the nation
GST reforms
India PMO
lockdown
Balakot airstrike
demonetization
Operation Sindoor

More Telugu News