వన్ టైమ్ ఫీజే.. హెచ్ 1బీ వీసా ఫీజుపై వైట్‌హౌస్ స్పష్టత
- వార్షిక ఫీజు కాదన్న ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్
- ఇప్పటికే హెచ్ 1బీ వీసా ఉన్న వారికి వర్తించదని వెల్లడి
- హెచ్ 1బీ వీసా హోల్డర్లు విదేశాలకు వెళ్లి రావచ్చని క్లారిటీ
హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు.