Nita Ambani: బాలీవుడ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నీతా అంబానీ.. అందరి చూపు ఆమెపైనే!

Nita Ambani Special Attraction at Bollywood Event
  • ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ప్రీమియర్ షో
  • ముంబైలో ఘనంగా జరిగిన కార్యక్రమం
  • భర్త ముఖేశ్ అంబానీతో కలిసి హాజరైన నీతా అంబానీ
  • గ్రీన్ శారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నీతా
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తన స్టైలిష్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆకుపచ్చ రంగు చీరలో, దానికి తగినట్లుగా ప్రత్యేకమైన నెక్లెస్‌తో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఈవెంట్‌కు హాజరైన వారందరిలోనూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’. ఈ సిరీస్ ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ముంబైలో చిత్ర యూనిట్ ఓ ప్రీమియర్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు.

ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా విచ్చేశారు. భర్త ముఖేశ్‌తో కలిసి నీతా అంబానీ ఫొటోలకు ఫోజులిచ్చారు. వారి పిల్లలు, కోడళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికి ఎలా హాజరు కావాలో నీతా అంబానీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ‌ చక్కర్లు కొడుతున్నాయి.
Nita Ambani
Mukesh Ambani
Aryan Khan
Bad News of Bollywood
Netflix
Bollywood event
Reliance Industries
Fashion sense
Mumbai event
Green saree

More Telugu News