Roja: ఏపీ మెగా డీఎస్సీలో టీచర్ గా ఎంపికైన సైనికురాలు

Soldier Roja Secures Teacher Position in Andhra Pradesh Mega DSC
––
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఓ సైనికురాలు సెలెక్టయ్యారు. సరిహద్దుల్లో సేవలందిస్తూనే టీచర్ జాబ్ కోసం సిద్దమై 83.16 మార్కులతో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా 2018లో తన సోదరితో కలిసి డీఎస్సీ రాశారు. ఫలితాల్లో ఆమె సోదరి టీచర్ కొలువు సాధించగా.. రోజా మాత్రం కొద్దిలో అవకాశం కోల్పోయారు. ఆ తర్వాత 2022లో ఎస్‌ఎస్‌సీ జీడీ పరీక్ష రాసి బీఎస్‌ఎఫ్‌ జవానుగా ఎంపికయ్యారు.

పంజాబ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనే లక్ష్యాన్ని రోజా వీడలేదు. ఓవైపు సరిహద్దుల్లో సేవలందిస్తూనే ఖాళీ సమయాల్లో డీఎస్సీకి సిద్దమయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో రోజా అనుకున్నది సాధించారు.
Roja
AP DSC
Mega DSC
Andhra Pradesh DSC
Teacher Recruitment
BSF Jawan
Chittoor District
Army Woman
Government Teacher Job
Jammu Kashmir

More Telugu News