తల్లి మందలించిందని ఉరేసుకున్న నవ వధువు
- హైదరాబాద్ లోని మూసాపేటలో విషాదం
- మూడు నెలల కిందటే వివాహం
- ఫోన్ మాట్లాడొద్దని మందలించిన తల్లి
ప్రస్తుతం భర్త అశోక్ తో పాటు రమ్య పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే రమ్య తరచుగా ఫోన్ లో మాట్లాడుతుండటంతో తులసమ్మ మందలించింది. వివాహం కూడా అయింది, ఇక సంసార బాధ్యతలు నేర్చుకోవాలని చెప్పింది. సోమవారం మధ్యాహ్నం తల్లీకూతుళ్లు మార్కెట్ కు వెళ్లి వచ్చాక ఈ విషాద సంఘటన జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రమ్య.. తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.
ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుమార్తె నిద్రపోతోందేమోనని భావించిన తులసమ్మ ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. రాత్రి 11:30 గంటల సమయంలో రమ్య ఉరేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి తులసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.