Ramu Rathod: పురుగులు ఏరుకుని అన్నం తిన్నాం: రాము రాథోడ్ తల్లిదండ్రులు

Ramu Rathod Parents Interview
  • కూలి పనులు చేసేవాళ్లం 
  • ముంబైలో కష్టాలు పడ్డాము 
  • రాము ఎన్నో కష్టాలు పడ్డాడు 
  • అతని చెమటతోనే ఈ స్థాయిలో ఉన్నామన్న పేరెంట్స్

 రాము రాథోడ్ .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. ఇప్పుడు తనని చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఎందుకంటే, ఒకప్పుడు టాలెంట్ ఉన్నప్పటికీ ఎవరు ప్రోత్సహిస్తారా అని ఎదురుచూసే పరిస్థితి. మనలోని టాలెంట్ ను ఎలా వెలికి తీయాలా అనే ఆరాటంతోనే చాలామంది జీవితాలు తెల్లారిపోయాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తరువాత ఎవరికి వారు తమ టాలెంటును ప్రపంచానికి చాటడానికి ఒక ఫ్లాట్ ఫామ్ ఏర్పడిపోయింది. 

అలా తన ఊరు దాటకుండానే ప్రపంచానికి తనని తాను పరిచయం చేసుకున్న కళాకారుడు రాము రాథోడ్. 'రాను బొంబైకి రాను' పాటతో సంచలనం సృష్టించిన రాము, ఇప్పుడు 'బిగ్ బాస్  సీజన్ 9'లో కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాము తల్లిదండ్రులు మాట్లాడారు. "మేము చాలా పేదరికం నుంచి వచ్చాం. చాలా కాలం పాటు మేము మన్ను మోశాము .. కూలి పని చేశాము. అలా పనిచేసే చోట పురుగులున్న అన్నం పెడితే, ఆ పురుగులు ఏరుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి" అని అన్నారు.     

"బొంబైలో ఒక చోట మేము పనికి కుదిరాము. పిల్లలు ఇక్కడే పెంకుటింట్లో ఉండేవాళ్లు. మా పెద్దమ్మాయి మిగతా వాళ్లను చూసుకునేది.  అప్పుడప్పుడు రాము ముంబైకి వచ్చేవాడు. పాత ఇనుప సామాను ఏరుకు రావడం .. చేపలు పట్టడం చేసేవాడు. అక్కడ కూడా రోజుకు నాలుగైదు వందలు సంపాదించేవాడు. ఇక్కడ పేరు వచ్చిన తరువాత, ఇల్లు కట్టి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. మా కొడుకు చెమటతోనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాము" అని చెప్పారు.

Ramu Rathod
Ranu Bombaikiranu
Big Boss Season 9
Suman TV Interview
Telugu Folk Singer
Viral Song
Poverty
Inspiration
Youtube Talent
Telangana Singer

More Telugu News