Shoaib Akhtar: అది తెలివితక్కువ నిర్ణయం.. మా కెప్టెన్ ఓ ‘ఐన్‌స్టీన్’.. ఓటమిపై మండిపడ్డ షోయబ్ అక్తర్

Shoaib Akhtar Slams Pakistan Captain After Loss to India
  • ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై కెప్టెన్‌పై అక్తర్ ఫైర్
  • పాక్ కెప్టెన్ సల్మాన్‌ను ‘ఐన్‌స్టీన్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు
  • స్పిన్నర్ల దెబ్బకు 127 పరుగులకే పాక్ కుప్పకూలిన వైనం
  • మ్యాచ్ తర్వాత కరచాలనం చేయలేదని టీమిండియాపై విమర్శ
భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి తర్వాత, ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తీసుకున్న నిర్ణయాన్ని ఎండగడుతూ, అతడిని ఓ ‘ఐన్‌స్టీన్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని అక్తర్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తోందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని తెలిసినా బ్యాటింగ్ తీసుకోవడం ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలోనే పిచ్ గురించి స్పష్టంగా వివరించాడని అక్తర్ గుర్తుచేశాడు.

“పిచ్ రిపోర్ట్ మొత్తం సూర్యకుమార్ యాదవ్ ఇచ్చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురుస్తుందని, అప్పుడు బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుందని చెప్పాడు. మా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది కాబట్టి ఛేజింగ్ చేయాలనే అనుకున్నామని, ముందుగా బౌలింగ్ చేయడానికే ఇష్టపడ్డామని అతను స్పష్టంగా చెప్పాడు. కానీ మన ఐన్‌స్టీన్ మాత్రం మేం ముందు బ్యాటింగ్ చేస్తామని అన్నాడు” అని షోయబ్ అక్తర్ విమర్శించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు), అక్షర్ పటేల్ (2 వికెట్లు) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన 40 పరుగులే అత్యధికం. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది.

అంతేకాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసే సంప్రదాయాన్ని పాటించకపోవడంపై కూడా షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Shoaib Akhtar
Salman Ali Agha
Pakistan cricket
Asia Cup 2025
India vs Pakistan
Cricket match
Kuldeep Yadav
Axar Patel
Dubai pitch
Suryakumar Yadav

More Telugu News