Penna River: పేకాటకు వెళ్లి పెన్నా నదిలో చిక్కుకున్న 17 మంది యువకులు.. వీడియో ఇదిగో!

17 Youths Stranded in Penna River While Gambling Rescued
  • నెల్లూరు జిల్లా భగత్ సింగ్ నగర్ లో ఘటన
  • యువకుల అరుపులతో గుర్తించిన స్థానికులు
  • బ్రిడ్జి పైనుంచి నిచ్చెన వేసి కాపాడిన అధికారులు
పేకాట ఆడేందుకు పెన్నా నది మధ్యలోకి వెళ్లిన యువకులు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. సోమవారం రాత్రి నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ కాలనీ వద్ద చోటుచేసుకుందీ ఘటన. సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో పెన్నా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో భయాందోళనలకు గురైన యువకులు కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికుల సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకుని అతికష్టమ్మీద వారందరినీ రక్షించారు.

బ్రిడ్జి పైనుంచి నిచ్చెన వేసి..

నది మధ్యలో యువకులు చిక్కుకున్న విషయం తెలిసి అగ్నిమాపక శాఖ, నవాబుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. బ్రిడ్జి కింద చీకటిగా ఉండడంతో లైట్లు ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, తాము పేకాట ఆడుతున్నామని పోలీసులు కేసు నమోదు చేస్తారనే భయంతో కొంతమంది యువకులు వరద నీళ్లలోనే పరుగులు పెట్టారు.

అధికారులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన వేసి 9 మందిని పైకి తీసుకొచ్చారు. మిగతా యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరద తగ్గడంతో నదిలో నుంచి బయటపడి ఉంటారని భావిస్తున్నారు. అయితే, నదిలో వారి కోసం రాత్రంతా గాలించారు. పోలీస్ కేసు భయంతో వారు దాక్కుని ఉంటారని అధికారులు చెబుతున్నారు.
Penna River
Nellore
Andhra Pradesh
River Rescue
Gambling
Youth trapped
Somashila project
Bhagat Singh Colony
River flooding
Police case

More Telugu News