Bandi Sanjay: కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay responds to KTR defamation case
  • పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానన్న బండి సంజయ్
  • కేటీఆర్‌లా రాజకీయాలు చేయనని పేర్కొన్న బండి సంజయ్
  • విమర్శలను రాజకీయంగా ఎదుర్కొంటాని స్పష్టీకరణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావాను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. కేటీఆర్ వలె తాను ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడనని పేర్కొన్నారు. విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రూ. 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
Bandi Sanjay
KTR
K Taraka Rama Rao
Defamation case
Phone tapping case
Telangana politics

More Telugu News