China: రష్యా నుంచి చమురు కొనుగోలు.. అమెరికాపై తీవ్రంగా స్పందించిన చైనా
- అమెరికా చెప్పినట్లు నాటో దేశాలు చేస్తే ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరిక
- ఇతర దేశాల వలె రష్యాతో తమకు సాధారణ సంబంధాలు ఉన్నాయని వెల్లడి
- అమెరికా ఏకపక్ష ఆంక్షలను చైనా వ్యతిరేకిస్తుందని స్పష్టీకరణ
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న తమతో పాటు అన్ని దేశాలపై నాటో దేశాలు అధిక టారిఫ్ విధించాలని అమెరికా పిలుపునివ్వడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం ఏకపక్షంగా వేధించడం, ఆర్థిక బలప్రదర్శనకు పాల్పడడమేనని ఆరోపించింది. అమెరికా చెప్పినట్లు నాటో దేశాలు చేస్తే తాము ప్రతిచర్యలు చేపడతామని చైనా హెచ్చరించింది.
ఒకపక్క స్పెయిన్ లో సోమవారం నుంచి ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొదలైన వేళ చైనా నుంచి ఇలాంటి స్పందన రావడం గమనార్హం. రోజువారీ సాధారణ ప్రెస్ బ్రీఫింగ్స్‌లో భాగంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జిన్ మాట్లాడుతూ, ప్రపంచంలోని ఇతర దేశాల వలె రష్యాతో కూడా తమకు సాధారణ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నట్లు తెలిపారు.
అమెరికా చర్యలు ఏకపక్ష వేధింపులని, ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను దెబ్బతీస్తాయని అన్నారు. ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక పంపిణీ వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. భయపెట్టడం, ఒత్తిడి చేయడం వంటి చర్యలతో సమస్యలను పరిష్కరించలేమని ఇదివరకే నిరూపితమైందని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఆచరణయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఏకపక్ష ఆంక్షలను చైనా ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. యూరప్, అమెరికా దేశాలు సైతం రష్యాతో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నాయని గుర్తు చేశారు. తమకు, రష్యా సంస్థల మధ్య సహకారం అంతర్జాతీయ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.