Anushka Shetty: ఆ క్రేజ్ అనుష్కకి మాత్రమే సొంతం .. కానీ ..!

Anushka Special
  • అందాల నాయికగా అనుష్కకి పేరు  
  • వరుసగా పడుతున్న ఫ్లాపులు
  • అయినా తగ్గని క్రేజ్ 
  • రీసెంటుగా నిరాశపరిచిన 'ఘాటి' 
  • నెక్స్ట్ ప్రాజెక్టుపై అభిమానుల ఆసక్తి 

అనుష్క తరువాత అంత అందమైన కథానాయికలు ఎవరైనా తెలుగు తెరపైకి వచ్చారా అంటే లేదనే చెప్పాలి. అనుష్క తరువాత అందమైన కథానాయికలు చాలామంది వచ్చారు. కాకపోతే వాళ్లెవరూ అనుష్క గ్లామర్ ను మరిచిపోయేలా చేయలేకపోయారు. అనుష్క కనుముక్కు తీరు .. ఆమె ఆకర్షణీయమైన రూపం అలాంటివి. అందువల్లనే 'అరుంధతి' .. 'రుద్రమదేవి' వంటి పాత్రలను డిజైన్ చేసుకున్న దర్శకులకు ఆమె తప్ప మరొకరు కనిపించలేదు. 

'బాహుబలి' సినిమాతో అనుష్కకి వచ్చిన క్రేజ్ మరొకరికి వచ్చి ఉంటే, వాళ్లు చకచకా చాలా ప్రాజెక్టులు ఒప్పేసుకుంటూ వెళ్లేవారు. కానీ అనుష్క సినిమాల సంఖ్యను తగ్గించడం అక్కడి నుంచే కనిపిస్తుంది. ఆ తరువాత సినిమాకి .. సినిమాకి మధ్య ఆమె ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. అది కూడా నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా ఎంచుకుంటూ వెళ్లారు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. ఆర్ధికంగాను డీలా పడ్డాయి. 

సాధారణంగా ఒక నాయిక వెండితెరకి దూరమై కొంతకాలమైతే, ప్రేక్షకులు చాలా తొందరగా మరిచిపోతారు. ఇండస్ట్రీ దృష్టి కూడా కొత్త నాయికలపైనే ఉంటుంది. కానీ అనుష్క ఎంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె సినిమాల కోసం ఎదురు చూసే అభిమానులు ఉన్నారు. ఆమె సినిమాలకి మంచి మార్కెట్ కూడా ఉంది. ఇది అనుష్క విషయంలో మాత్రమే జరుగుతున్న విచిత్రం. రీసెంటుగా వచ్చిన 'ఘాటి' విషయంలోనూ ఇదే జరిగింది. అయితే కథాకథనాల పరంగా ఈ సినిమా నిరాశ పరిచింది. అయినా అనుష్క అభిమానులు ఆమె నుంచి మరో సినిమా రావాలనే కోరుకుంటూ ఉండటం విశేషం. కాకపోతే కథల విషయంలో .. తన పాత్ర విషయంలో ఆమె మరింత దృష్టిపెట్టాలనేది అభిమానుల మాటగా వినిస్తోంది. మరి అనుష్క ఈ సారి ఎంత గ్యాప్ తీసుకుంటుందో .. ఏ ప్రాజెక్టును లైన్లో పెడుతుందో చూడాలి. 

Anushka Shetty
Anushka
Telugu cinema
actress
heroine
glamour
Arundhati
Rudramadevi
Baahubali
Miss Shetty Mr Polishetty

More Telugu News