Jagan: మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడిన జగన్

Jagan Praises Mokshagundam Visvesvaraya Services
  • ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని ట్వీట్
  • దేశం గర్వించదగ్గ నిపుణుడు అని కొనియాడిన జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంజినీర్లకు ‘ఇంజినీర్స్ డే’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను జగన్ స్మరించుకున్నారు. "దేశం గర్వించదగ్గ ఇంజినీరింగ్ నిపుణులు, ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు" అని తన పోస్టులో పేర్కొన్నారు.

భారతదేశపు గొప్ప ఇంజినీరింగ్ మేధావిగా పేరుగాంచిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజైన సెప్టెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్రను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. 
Jagan
YS Jagan
Engineers Day
Mokshagundam Visvesvaraya
Sir MV
Visvesvaraya
Engineering
Irrigation Projects
India
Bharat Ratna

More Telugu News