Ananth Sriram: దిన దిన గండంగా ఉంది: అనంత్ శ్రీరామ్

Ananth Sriram Interview
  • పాటల రచయితగా అనంత్ శ్రీరామ్ కి మంచి పేరు 
  • 1500 పాటలు రాశానని వెల్లడి
  • 19 ఏళ్ల కెరియర్ చూశానని వివరణ  
  • కొత్త ప్రయోగాలు చేయలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య

తెలుగు పాటకి కొత్త సొగసులు దిద్దిన పాటల రచయితగా అనంత్ శ్రీరామ్ కనిపిస్తారు. కొన్ని పాటలలో ఆయన చేసిన పద ప్రయోగాలు గొప్పగా అనిపిస్తాయి. అలాంటి అనంత్ శ్రీరామ్ తాజాగా 'హిట్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడప్పుడు కొన్ని మంచి పాటలు రాస్తున్నప్పటికీ, దర్శక నిర్మాతలకు నాపై నమ్మకం కలగడానికి ఆరేళ్లు పట్టింది. లవ్ సాంగ్స్ తో పాటు, మాస్ సాంగ్స్ కూడా వరుస హిట్లు ఇచ్చాను" అని అన్నారు. 

"అయితే అందరూ లవ్ సాంగ్స్ బాగా రాయగలడు అనే ముద్రవేసి అవి మాత్రమే రాయించేవారు. దాంతో కొంతకాలం పాటు లవ్ సాంగ్స్ రాయడం ఆపేసి, మాస్ సాంగ్స్ మాత్రమే రాస్తూ వెళ్లవలసి వచ్చింది. 1500 పాటలు రాసిన తరువాత .. 19 ఏళ్ల కెరియర్ నడిచాక ఇప్పుడు నేను అనుకున్న స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. ఒక మంచి పాట రావాలంటే .. కొత్త పదాలు పడాలంటే అందుకు తగిన సాహిత్య పరిజ్ఞానం దర్శకుడికి కూడా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది" అని చెప్పారు. 

"ఇండస్ట్రీకి వచ్చి హీరోగా .. దర్శకుడిగా .. డీఓపీగా ట్రై చేసి విఫలమైన వాళ్లు కూడా పాటలు రాసేద్దామని అనుకునే పరిస్థితి వచ్చింది. అందరికి తెలిసిన కొన్ని పదాల పరిధిలోనే అనేక భావాలను బయటకి తీసుకురావలసి వస్తోంది. నిజం చెప్పాలంటే పాటల రచయిత పరిస్థితి దినదిన గండంగా ఉంది. పాటలు రాయాలని అనుకునేవాళ్లు తక్కువ .. అలా అనుకుని పాటల రచయితలు అయ్యేవాళ్లు తక్కువ కాబట్టి ఇంకా మా మనుగడ కొనసాగుతోంది" అని చెప్పారు.

Ananth Sriram
Ananth Sriram Telugu lyricist
Telugu songs
Tollywood lyrics
Telugu film industry
Telugu cinema
lyric writing challenges
mass songs
love songs
hit songs

More Telugu News