ఉప్పొంగుతున్న నదిలో నడుచుకుంటూ వెళ్లి టీకాలు వేసిన ఏఎన్ఎం
––
ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నాటు పడవలు కూడా అందుబాటులో లేవు. ఎలాగైనా టీకాలు వేసి రావాల్సిందేనని నిర్ణయించుకున్న ఏఎన్ఎం సావిత్రి.. ఆశా వర్కర్ రుప్పమ్మ, మరో మహిళతో కలిసి నదిలో నడుచుకుంటూ వెళ్లి సుళ్లారి చేరుకున్నారు. గర్భిణితో పాటు బాలుడికి సమయానికి టీకాలు వేశారు. ఉప్పొంగుతున్న నదిని దాటి వచ్చి టీకాలు వేసిన ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణ విషయంలో వారు చూపిన తెగువను పలువురు అభినందిస్తున్నారు.