కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్!
- జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి పరీక్షలు
- నలుగురికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు అలర్ట్
- పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
ఈ నెల 12న చేబ్రోలుకు చెందిన ఆశా వర్కర్ సులోచన కూడా జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మృతి చెందారు. సులోచన వయసు 45 ఏళ్లే కావడం, జ్వరంతో మరణించడంపై అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామంలో అనారోగ్యం బారిన పడిన వారికి చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వారు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, కొత్తరెడ్డిపాలెంలో ఫీవర్ కేసులు అధికంగా వస్తున్నాయని చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యురాలు ఊర్మిళ తెలిపారు. తొమ్మిది మందికి బ్లడ్ కల్చర్ టెస్టు చేయగా ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్‌గా తేలిందని వివరించారు. మరో కేసులో మెలియాయిడోసిస్ కేసుగా అనుమానాలున్నాయని పేర్కొన్నారు.