Abhishek Banerjee: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.20 కోట్లు.. బీజేపీపై టీఎంసీ సంచలన ఆరోపణలు

Abhishek Banerjee Alleges BJP Paid 20 Crores Per Vote in Vice President Election
  • ఆప్ మహిళా ఎంపీ సహా ఐదుగురు క్రాస్ ఓటింగ్ చేశారన్న టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ 
  • అందుకే భారీ మెజారిటీ వచ్చిందని వ్యాఖ్య 
  • ఇండియా కూటమిలో ఐకమత్యం లోపించిందని విమర్శ 
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అధికార బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అక్రమాలకు పాల్పడిందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఒక్కో ఓటుకు రూ. 20 కోట్లు ఇచ్చి ఇండియా కూటమి ఎంపీలను కొనుగోలు చేసిందని మండిపడ్డారు. కూటమి ఐక్యతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ దెబ్బ తీశారని ఆయన ఆరోపించారు. ఆప్ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్ ను విమర్శించే సదరు ఎంపీ బహిరంగంగానే బీజేపీకి మద్దతు తెలిపారని, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కట్టుబాటును తుంగలో తొక్కారని అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ మహిళా ఎంపీ సహా మొత్తం ఐదుగురు ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, ఇండియా కూటమి అభ్యర్థిని కాదని ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటేశారని అన్నారు. ఈ క్రాస్ ఓటింగ్ కారణంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థికి భారీ మెజారిటీ లభించిందని అభిషేక్ వ్యాఖ్యానించారు. చెల్లకుండా పోయిన ఓట్లను పరిగణనలోకి తీసుకున్నా కనీసం ఐదు నుంచి ఏడుగురు ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు అర్థమవుతోందని, వారికి బీజేపీ నుంచి రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ముట్టిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
Abhishek Banerjee
Vice President Election
TMC allegations
BJP
Cross Voting
India Alliance
AAP
Arvind Kejriwal
Radhakrishnan
Political News

More Telugu News