Teja Sajja: మిరాయ్ సినిమా టికెట్లపై కీలక నిర్ణయం

Teja Sajja Announces Key Decision on Mirai Movie Tickets
  • ఈ నెల 12న విడుదల కానున్న మిరాయ్ మూవీ
  • టికెట్ ధర పెంపు లేదన్న హీరో తేజ సజ్జా 
  • సినిమాను ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్న తేజ
తేజ సజ్జా హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మిరాయ్’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ విలన్ పాత్రలో నటించగా, రితిక నాయక్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. మిరాయ్ సినిమా టికెట్ల ధరలపై హీరో తేజ సజ్జా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.

ఈ వేడుకలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, "మిరాయ్ సినిమాను ఎంతో కష్టపడి, ప్రేమతో రూపొందించాం. ఈ సినిమాను ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి, సినిమా టికెట్ల ధరలు పెంచకూడదని నిర్ణయించాం. సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇది రిస్క్ అయినప్పటికీ, ప్రేక్షకులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడమే మా లక్ష్యం" అని అన్నారు.

యూఎస్ లో ఓపెన్ అయిన టికెట్లు

యూఎస్‌లో మిరాయ్ సినిమా టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయని తేజ తెలిపారు. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 

Teja Sajja
Mirai movie
Telugu movie
Karthik Ghattamaneni
TG Vishwa Prasad
Rithika Naik
Manoj
Mirai tickets
Visakhapatnam
pre release event

More Telugu News