Volodymyr Zelensky: భారత్ పై అమెరికా ఆంక్షలను సమర్థించిన జెలెన్ స్కీ

Zelensky backs US tariffs on India for Russia oil imports
  • రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై పన్నులు విధించాల్సిందేనని వ్యాఖ్య
  • యుద్ధం ఆపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నా సరే భారత్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడి అక్కసు
  • ఇటీవల పుతిన్ తో భేటీకి ముందు జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడిన మోదీ
భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లు విధించడం సమంజసమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్న దేశాలపై పన్నులు విధించాల్సిందేనని ఆయన అన్నారు. ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేయాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ మేరకు జెలెన్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లో విధ్వంసం సృష్టిస్తున్న రష్యాతో వ్యాపార లావాదేవీలు జరపడం అన్యాయమని ఆరోపించారు. చమురు అమ్మకాల ద్వారా అందుతున్న డాలర్లను రష్యా తమపై దాడులకు వెచ్చిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేయడమంటే ఉక్రెయిన్ పై దాడులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని విమర్శించారు. అలాంటి దేశాలపై పన్నులు విధించడంలో తప్పేమీ లేదని ఆయన పేర్కొన్నారు.


ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఆపేందుకు భారత్‌ కూడా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రధాని మోదీ అటు పుతిన్‌, ఇటు జెలెన్‌ స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెలలో పుతిన్‌ తో భేటీకి ముందు జెలెన్ స్కీతో మోదీ ఫోన్ లో మాట్లాడారు. పుతిన్ తో భేటీ తర్వాత.. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారం అందించేందుకు, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని మోదీ ట్వీట్‌ చేశారు.
Volodymyr Zelensky
Ukraine
Russia
India
Narendra Modi
Vladimir Putin
US Tariffs
Oil Purchase
Ukraine War
санкции

More Telugu News