సముద్రంలో తెగిన కేబుల్స్.. పాక్ సహా పలు దేశాలకు ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
- కేబుల్స్ ఎలా తెగాయనే విషయం తెలియరాలేదంటున్న నిపుణులు
- హౌతీ రెబెల్స్ పనేనని అనుమానాలు
- యూఏఈ దేశాల్లోనూ నెట్ సేవలకు అంతరాయం
యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌతీ రెబెల్స్ గతంలో ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడులు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకే హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారని ఆరోపణలు రాగా హౌతీ రెబెల్స్ ఖండించారు. తాజా ఘటనపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ, యూఏఈ, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.