Hyderabad: ఆల్ టైం రికార్డ్.. హైద‌రాబాద్‌లో రూ. 2.32 కోట్లు ప‌లికిన వినాయ‌కుడి ల‌డ్దూ

Ganesh Laddu Sold for Record 232 Crores in Hyderabad
  • హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పలికిన గణేశ్ లడ్డూ ధర
  • బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాట
  • ఏకంగా రూ. 2.32 కోట్లకు లడ్డూను దక్కించుకున్న భక్తులు
  • గతేడాది నమోదైన రూ. 1.87 కోట్ల రికార్డు బద్దలు
తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతుండగా, లడ్డూల వేలంపాటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డూ ఏకంగా రూ. 2.32 కోట్లకు అమ్ముడుపోయింది. శుక్రవారం జరిగిన ఈ వేలంపాటలో గత ఏడాది రికార్డును తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది.

కీర్తి రిచ్మండ్ విల్లాస్ కమ్యూనిటీలో వినాయక నవరాత్రులను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జరిగిన వేలంలో లడ్డూను రూ. 2 కోట్ల 31 లక్షల 95 వేలు వెచ్చించి దక్కించుకున్నారు. ఈ భారీ మొత్తం నగరంలోని ఓ కమ్యూనిటీలో పలికిన అత్యధిక ధరగా నిలిచింది.

గతేడాది ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో లడ్డూ ధర రూ. 1.87 కోట్లు పలకగా, ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ సుమారు రూ. 45 లక్షలకు పైగా అధికంగా ధర పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ శోభాయాత్రలు, లడ్డూ వేలంపాటలు ఉత్సాహంగా జరుగుతున్న వేళ, ఈ రికార్డు ధర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Hyderabad
Ganesh Laddu
Hyderabad Ganesh
Laddu Auction
Ganesh Nimajjanam
Keerthi Richmond Villas
Bandlaguda Jagir
Ganesh Chaturthi
Telangana Festivals
Ganesh Shobhayatra
Laddu Price

More Telugu News