Akshay Kumar: పంజాబ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్

Akshay Kumar Announces Huge Donation to Punjab Flood Victims
  • పంజాబ్ వర్ష బాధితులకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన నటుడు అక్షయ్ కుమార్  
  • ఇది విరాళం అనుకోవడం లేదన్న అక్షయ్ కుమార్
  • అవసరమైనవారికి సాయం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్న అక్షయ్
  • కుమార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. గత 37 సంవత్సరాలలో ఎన్నడూ చూడని విధంగా విపత్తు సంభవించింది. వరదల కారణంగా అనేకమంది ప్రజలు తమ నివాసాలను, జీవనోపాధిని కోల్పోయారు.

ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తనవంతుగా రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ సహాయం గురించి ఆయన స్పందించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘దీన్ని నేను విరాళంగా భావించడం లేదు. విరాళం అనే పదం నాకు నచ్చదు. నేను విరాళం చేయడానికి ఎవరిని? ఇది కేవలం సేవ మాత్రమే. అవసరమైన వారికి సహాయం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. ‘ఇప్పుడు నేను ఒక చిన్న సహాయం మాత్రమే చేశాను’ అని పేర్కొన్నారు.

అక్షయ్ కుమార్ గతంలో కూడా భారీ ఆర్థిక సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి. చెన్నై వరదల సమయంలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన తన వంతు సహాయం అందించారు. 'భారత్ కీ వీర్' కార్యక్రమంలో భాగంగా పలు సైనిక కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేశారు. 
Akshay Kumar
Punjab floods
Bollywood actor
Donation
Flood relief
India floods
Charity
Akshay Kumar donation
Punjab
Disaster relief

More Telugu News