Joe Biden: తలపై గాయంతో, బలహీనంగా కనిపిస్తున్న బైడెన్!

Joe Biden Appears Frail With Head Injury
  • అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై మళ్లీ తీవ్ర చర్చ 
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తాజా వీడియోలు
  • బైడెన్‌కు చర్మ క్యాన్సర్‌ శస్త్రచికిత్స జరిగిందంటూ మీడియా కథనాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఆయన తలపై ఒక గాయంతో, మునుపటి కంటే నీరసంగా, బడలికతో కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ఆయన ఆరోగ్య స్థితి గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, బైడెన్‌కు ఇటీవలే చర్మ క్యాన్సర్‌కు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ కారణంగానే ఆయన తలపై గాయం ఏర్పడిందని తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన వీడియోలలో బైడెన్ చాలా అలసిపోయినట్లు, బలహీనంగా కనిపించడంతో ఆయన ఆరోగ్యం చుట్టూ జరుగుతున్న చర్చ మరింత ఊపందుకుంది. 

82 ఏళ్ల జో బైడెన్ ఆరోగ్యంపై చర్చ జరగడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఆయనకు చర్మ క్యాన్సర్‌కు సంబంధించి చిన్నపాటి చికిత్సలు జరిగినట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. అయితే, తాజా శస్త్రచికిత్స తీవ్రత, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.


Joe Biden
Joe Biden health
Joe Biden injury
Joe Biden skin cancer
US President
Joe Biden surgery
Political analysis
Health concerns
Biden health updates
America

More Telugu News