Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ను అభినందించిన ఏపీ కేబినెట్... ఎందుకంటే...!

AP Cabinet Congratulates Minister Nara Lokesh for Successful DSC
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • ఎన్ని అడ్డంకులు ఎదురైనా డీఎస్సీని విజయవంతం చేశారంటూ లోకేశ్ పై ప్రశంసలు
  • 72 కేసులు వేసినా లోకేశ్ దీటుగా ఎదుర్కొన్నారంటూ కితాబు
ఇవాళ ముఖ్యమంత్రి  చంద్రబాబు అధ్యక్షత ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ సహచరులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను అభినందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇచ్చిన మాట ప్రకారం విజయవంతంగా డీఎస్సీ నిర్వహించారంటూ కేబినెట్ సహచరులు... మంత్రి నారా లోకేశ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. డీఎస్సీని ఆపేందుకు 72 కేసులు వేసినా, నారా లోకేశ్ దీటుగా నిలబడి ఎలాంటి అవాంతరాలు లేకుండా డీఎస్సీ ప్రక్రియను సజావుగా పూర్తి చేశారని కొనియాడారు. 

ఇక, పోలీసుల్లో కొందరు డీఎస్సీకి ఎంపికయ్యారని, దాంతో పోలీసు శాఖలో ఖాళీలు ఏర్పడతాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. అయితే, పోలీసు శాఖలో ఖాళీలను సత్వరమే భర్తీ చేసేందుకు ఏవైనా న్యాయపరమైన చిక్కులు వచ్చినా, ఎదుర్కొందామని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ఇటీవలి డీఎస్సీలో దాదాపు 400 మంది వరకు పోలీసులు టీచర్లుగా ఎంపికైనట్టు తెలుస్తోంది. 
Nara Lokesh
AP Cabinet
DSC Exam
Andhra Pradesh Education
Chandrababu Naidu
AP Government
Teacher Recruitment
Police Recruitment

More Telugu News