Haider Ali: నెల రోజుల ఉత్కంఠకు తెర.. అత్యాచారం కేసులో పాక్ క్రికెటర్‌ హైదర్ అలీకి క్లీన్ చిట్

Ignored Pakistan Star Gets Big Relief In Alleged Rape Case In UK
  • పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీకి యూకేలో భారీ ఊరట
  • అతనిపై నమోదైన అత్యాచారం కేసు నుంచి విముక్తి
  • ఆధారాలు లేవంటూ కేసును మూసివేసిన గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు
  • గత నెల మాంచెస్టర్‌లో ఒక మహిళ ఫిర్యాదుతో అరెస్ట్
  • హైదర్ అలీపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని పీసీబీ ఎత్తివేసే అవకాశం
పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీకి అతిపెద్ద ఊరట లభించింది. తీవ్ర సంచలనం రేపిన అత్యాచారం కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. హైదర్ అలీపై నమోదైన రేప్ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు తగిన ఆధారాలు లేవని నిర్ధారించుకున్న గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) ఈ కేసును మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. దీంతో నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

అసలేం జరిగిందంటే.. 
యూకే పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్‌లోని ఒక హోటల్‌లో జులై 23న హైదర్ అలీ తనపై అత్యాచారం చేశాడని బ్రిటన్‌లో నివసించే పాకిస్థానీ సంతతికి చెందిన ఒక మహిళ ఆగస్టు 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో యూకేలో అత్యాచారం నేరానికి గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, షాహీన్స్ జట్టు తరఫున పర్యటనలో చివరి మ్యాచ్ ఆడుతున్న హైదర్ అలీని బెకన్‌హామ్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆగస్టు 8న అతనికి బెయిల్ మంజూరైంది.

ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెంటనే స్పందించింది. యూకేలో హైదర్ అలీపై క్రిమినల్ దర్యాప్తు జరుగుతోందని ధ్రువీకరించింది. అక్కడి చట్టపరమైన విచారణకు గౌరవం ఇస్తామని చెబుతూ, దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీపై తక్షణమే తాత్కాలిక సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాత, తమ ప్రవర్తనా నియమావళి ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ అప్పట్లో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

తాజాగా పోలీసులు కేసును మూసివేయడంతో హైదర్ అలీపై ఉన్న అన్ని ఆంక్షలు తొలగిపోయాయి. అతను మళ్లీ ప్రయాణాలు చేసేందుకు అనుమతి లభించింది. పీసీబీ కూడా అతనిపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని త్వరలోనే ఎత్తివేసే అవకాశం ఉంది.
Haider Ali
Pakistan cricketer
rape case
Greater Manchester Police
Crown Prosecution Service
PCB
sexual assault
UK tour
Pakistani origin woman

More Telugu News