Narendra Modi: మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి

Narendra Modi deeply hurt by inappropriate comments on his mother
  • ప్రధానమంత్రి నరేంద్రమోదీ దివంగత తల్లిపై ప్రతిపక్ష నేతల వివాదాస్పద వ్యాఖ్యలు
  • 'జీవిక దీదీ'ల సభలో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధానమంత్రి
  • దూషించిన వారిని నేను క్షమించినా, ప్రజలు క్షమించరంటూ హెచ్చరిక
  • ఇది మహిళా జాతి మొత్తాన్ని అవమానించడమేనన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
  • రాజకీయ ప్రమాణాలు పడిపోతున్నాయంటూ తీవ్ర విమర్శ
రాజకీయాల్లోకి తన తల్లిని లాగి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేని తన తల్లిని దూషించడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా తీవ్రంగా స్పందించారు. ఇది యావత్ మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆమె మండిపడ్డారు.

ప్రధాని ఆవేదన వ్యక్తం చేసిన గంటల్లోనే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందిస్తూ, "ప్రధానమంత్రి తల్లిపై అనుచిత భాషను ఉపయోగించడం రాజకీయ ప్రమాణాలను దిగజార్చడమే. ఇది మాతృత్వ పవిత్రతను దెబ్బతీస్తుంది. ఇంత జరిగినప్పటికీ, సంబంధిత నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోవడం విచారకరం" అని ఆమె వ్యాఖ్యానించారు. ఇది అత్యంత నీచస్థాయి రాజకీయాలకు నిదర్శనమని ఆమె అన్నారు.
Narendra Modi
Modi mother
Rekha Gupta
Delhi CM
Bihar
politics
Congress
RJD
political criticism

More Telugu News